కరోనా ఎఫెక్ట్‌: పనస రేటు డబుల్

కేరళలో అమాంతంగా పనసుకు డిమాండ్ పెరిగిపోయింది. కారణం కరోనా వైరస్‌. శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎంత చెప్పినా. చికెన్‌ తింటే కరోనా వస్తుందన్న ప్రచారం గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. ఇపుడు జనం చికెన్‌ బదులు పనసపై పడ్డారు.చికెన్‌ బదులు పనస కూరలు తినడం, పనస బిర్యానీలు తినడం ప్రారంభించారు. దీంతో పనస రేటు డబుల్ అయిపోయింది. చికెన్‌ ధర కిలో రూ.80కి పడిపోతే. మొన్నటి దాకా రూ.50 ఉన్న కిలో పనస ఇపుడు రూ.120 పలుకుతోంది.