Health Tips: జలుబు.. వచ్చిందంటే చాలు.. ఓ పట్టాన వదలదు. ఓ సామెత ఉంది. జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారంరోజుల్లో తగ్గుతుంది. వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని చెబుతారు. దానికి తోడు ముక్కు దిబ్బడ కూడా ఇబ్బంది పెడుతుంది. జలుబును త్వరగా తగ్గించుకోవడానికి మార్గాలున్నాయి. ఏంటంటే..
గోరువెచ్చటి నీరు, గోరువెచ్చటి సూప్స్ తాగితే… వెంటనే ఉపశమనం కలుగుతుంది.గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీని తాగితే శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు, బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. దీంతో జలుబు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిత్యం 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీని తాగడం వల్ల జలుబును తగ్గించుకోవచ్చు.