నెయ్యిని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. వంటకాలలో కూడా నెయ్యిని ఎంతగానో వాడుతారు, అలాగే నెయ్యితో టేస్ట్ వచ్చే వంటలు కూడా చాలానే ఉంటాయి. కానీ ఈ నెయ్యిని తింటే బరువు పెరుగుతారనే అపోహ చాలా మందిలో ఉంటుంది. నెయ్యిలో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా నెయ్యిని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాల మందికి ఉదయాన్నే లేవగనే కాఫీ, టీ తాగడం లేదంటే డైరెక్ట్ గా బ్రేక్ ఫాస్ట్ చేయడం వంటి అలవాట్లు ఉంటాయి. అయితే ఇవి కాకుండా ఉదయాన్నే నెయ్యి తింటే చాల అనారోగ్య సమస్యలను తరిమి కొట్టొచ్చు. నెయ్యి తినడం ద్వారా బ్రెయిన్ సెల్స్ ఆక్టివ్ గా పనిచేస్తూ జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్ధ్యాన్ని పెంచుతాయి.
విటమిన్ ఏ ఉండే ఈ నెయ్యిని తగిన మోతాదులో తీసుకుంటే కళ్ళకు కూడా ఎంతో మంచిది. వయసు మీద పడినవారు ఉదయాన్నే నెయ్యి తింటే అల్సర్ నుంచి బయట పడొచ్చు.
ఉదయాన్నే నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అలాగే జుట్టు ఊడడం తగ్గి కాంతివంతంగా తయారవుతుంది. అందరు అనుకుంటున్నట్టు నెయ్యి తింటే బరువు పెరిగారు. ఇందులో ఉండే కొవ్వు పదార్థాలు శరీరం బరువు పెరగకుండా తోడ్పడతాయి.